ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అంతర్వేది పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ నెల 30 (శుక్రవారం)న అంతర్వేదిలో పర్యటించాల్సి ఉంది. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. పర్యటనకు సంబంధించిన తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.