దళితుల ఆలోచనల్లో మార్పు రానంతవరకూ అంబేడ్కర్ కలలు కన్న నిమ్నజాతులకు రాజ్యాధికారం అనేది అందని ద్రాక్షగానే మిగిలిపోతుందని దళిత చైతన్య వేదిక నాయకులు అన్నారు. బుధవారం రాజోలు మండలం రాజోలులో దళిత చైతన్య వేదిక ఆధ్వర్యంలో బొడ్డపల్లి ప్రసాద్ సారధ్యంలో ఇంటింటా అంబేడ్కర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజోలు గ్రామంలోని పలు ప్రాంతాలలో ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు.