మొందా తుపాను కారణంగా జిల్లావ్యాప్తంగా విద్యుత్తు శాఖకు రూ. 16 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సూపరింటెండెంట్ రాజేశ్వరి తెలిపారు. రాజోలులో గురువారం ఆమె మాట్లాడుతూ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నష్టాన్ని తగ్గించగలిగామని, తీరం దాటకముందే సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారని పేర్కొన్నారు. దెబ్బతిన్న స్తంభాలు, నియంత్రికలను దాదాపుగా బాగు చేశామని, గురువారానికి జిల్లావ్యాప్తంగా వంద శాతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని తెలిపారు.