నిరుపేదకు వైద్య ఖర్చులకై రూ.34 వేల ఆర్థిక సాయం

1137చూసినవారు
నిరుపేదకు వైద్య ఖర్చులకై రూ.34 వేల ఆర్థిక సాయం
పశ్చిమగోదావరి జిల్లా దూబచర్ల, గంటావారిగూడెంలో రోడ్డు ప్రమాదానికి గురై వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేని కేత ధర్మారావుకు గల్ఫ్ శెట్టిబలిజ యువశక్తి సేవాసంస్థ రూ.34 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కట్టా భాస్కర్, పెద్ద మొత్తంలో సహాయం చేసిన గుత్తుల మీరాకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు గుబ్బల శ్రీనివాస్, కౌరు నరసింహస్వామి, చెల్లుబోయిన సుబ్రమణ్యం, గుత్తుల మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సంఘటన కోనసీమ, రాజోలు ప్రాంతంలో జరిగింది.

సంబంధిత పోస్ట్