అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఆదివారం మలికిపురం మండలం ఇరుసుమండలోని మోరి-5 బావి వద్ద సంభవించిన బ్లోఅవుట్ ను సమర్థవంతంగా నియంత్రించిన ఉద్యోగులను సత్కరించారు. ప్రాణాలకు తెగించి పెను ప్రమాదాన్ని అదుపులోకి తెచ్చిన ఉద్యోగుల కృషి అనిర్వచనీయమని ఆయన కొనియాడారు. ఈ సంఘటనలో ఉద్యోగుల ధైర్యసాహసాలను, అంకితభావాన్ని ఎంపీ ప్రశంసించారు.