లక్కవరం: 'డీకే శివకుమార్ ప్రమాణస్వీకారంపై హర్షం'
కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించనుండడంపై పీసీసీ సభ్యులు గోపాలకృష్ణం రాజు హర్షం వ్యక్తం చేశారు. లక్కవరంలో మాట్లాడుతూ, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, పార్టీ సభ్యత్వాలను 90 లక్షలకు పెంచిన శివకుమార్ లాంటి సమర్థులను గుర్తిస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలపడుతుందని అన్నారు. ఆయన నేతృత్వ స్ఫూర్తితో 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి, రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.
