మలికిపురం VRK ఫంక్షన్ హాల్‌లో ఆల్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ASWA) ఆధ్వర్యంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ టాపర్లకు గురువారం ఘన సన్మానం జరిగింది. రాజోలు ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మెమెంటోలు, పురస్కారాలు అందజేశారు. విద్య జీవితానికి శక్తివంతమైన ఆయుధమని, గ్రామీణ విద్యార్థులు పట్టుదలతో జాతీయ స్థాయిలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్న ASWA ప్రతినిధి పోలిశెట్టి గణేష్‌ను ఆయన అభినందించారు. ఈ వేడుకలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.