మలికిపురం: ఇద్దరు పిల్లలతో నదిలోకి దూకిన తండ్రి..?

4758చూసినవారు
మలికిపురం: ఇద్దరు పిల్లలతో నదిలోకి దూకిన తండ్రి..?
మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన శిరిగినీడి దుర్గాప్రసాద్ రాత్రి తన ద్విచక్రవాహనాన్ని దిండి-చించినాడ వశిష్ఠ వారధిపై నిలిపి తన చరవాణి, చెప్పులు, కొన్ని చరవాణి నంబర్లతో రాసి ఉన్న కాగితాన్ని అక్కడే వదిలి ఉంచడాన్ని స్థానికులు గుర్తించారు. దుర్గాప్రసాద్ చెప్పులతో పాటు తన కుమారుడు మోహిత్(14), కుమార్తె జాహ్నవి(9)లకు చెందిన చెప్పులు కూడా అక్కడే ఉండడంతో ఆ ఇద్దరు పిల్లలతో కలిసి నదిలో దూకి ఉండొచ్చని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్