మలికిపురంలో మిన్నంటిన మే డే సంబరాలు - భారీ ఆటో ర్యాలీ

890చూసినవారు
శుక్రవారం మలికిపురంలో శ్రీ అరుణోదయ పెయింటింగ్ వర్క్స్ యూనియన్ ఆధ్వర్యంలో మే డే వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సఖినేటిపల్లి రేవు నుండి గుడిమెల్లంక వరకు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి కార్మిక ఐక్యతను చాటారు. ఈ కార్యక్రమంలో మలికిపురం ఎస్ఐ ముఖ్య అతిథిగా పాల్గొని, కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాలకు చెందిన ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్