కేశనపల్లి కాలువ పనులపై ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సమీక్ష

1083చూసినవారు
కేశనపల్లి కాలువ పనులపై ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సమీక్ష
రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ బుధవారం మలికిపురం మండలం లక్కవరం నుంచి కేశనపల్లి వరకు ప్రతిపాదించిన ఇరిగేషన్ కెనాల్ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు, రైతులు, కూటమి నాయకులతో కలిసి భూసేకరణ, నీటి సరఫరా సామర్థ్యంపై సమీక్ష నిర్వహించారు. కాలువ నిర్మాణం పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతులకు మేలు చేకూరేలా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు అడ్డంకులను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్