రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మంగళవారం మలికిపురం మండలం ముత్యాల నగర్‌లో పర్యటించి, స్థానికులతో సమావేశమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ప్రజల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో పలువురు స్థానిక నాయకులు, అధికారులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.