కుమార్తె వివాహ శుభలేఖలు బంధువులకు పంచి తిరిగి వస్తుండగా, సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన పేరాబత్తుల కొండలరావు (58) ఆదివారం టి. సావరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఆయన తలకు బలమైన గాయమైంది. రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వివాహ వేడుక జరగాల్సిన ఇంట్లో ఈ విషాదం చోటుచేసుకోవడంతో మోరి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.