రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయ ప్రారంభోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి పాల్గొని, శివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆమె భోళాశంకరుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.