రాజోలు మండలం పాలగుమ్మిలో శుక్రవారం, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ రూ.32 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికులతో సమావేశమై గ్రామ సమస్యలపై చర్చించారు. పాలగుమ్మిలో పంచాయతీ భవనం ఏర్పాటు కావడం సంతోషకరమని, దీనివల్ల ప్రజలకు సౌలభ్యం కలుగుతుందని ఆయన అన్నారు.