రాజోలు: సైలెన్సర్లు తొలగించిన 15 బైక్‌లు సీజ్

2చూసినవారు
రాజోలు: సైలెన్సర్లు తొలగించిన 15 బైక్‌లు సీజ్
మలికిపురం మండలం లక్కవరంలో శుక్రవారం ఒక సినిమా రీ-రిలీజ్ సందర్భంగా సైలెన్సర్లు తీసేసి, శబ్ద కాలుష్యంతో హల్‌చల్ చేసిన యువకులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించిన 15 బైక్‌లను సీజ్ చేసినట్లు రాజోలు సీఐ వి. సురేష్ బాబు తెలిపారు. రోడ్లు బ్లాక్ చేసినా, నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగినా, మైనర్లకు వాహనాలిచ్చినా తల్లిదండ్రులపై సైతం చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్