రాజోలు నియోజకవర్గంలో కాలువలు, డ్రైనేజీల పునరుద్ధరణ కోసం రూ. 3.50 కోట్లతో చేపట్టిన పనులను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ బుధవారం శివకోడు లాకుల వద్ద ప్రారంభించారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన కాలువలను శుభ్రం చేసి, గట్లను బలపరచడం ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆయన తెలిపారు. అధికారులు శాస్త్రీయ ప్రణాళికతో పనులు చేపట్టాలని, రైతులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ నాయకులు, రైతులు పాల్గొన్నారు.