రాజోలు: 'కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేయాలని చూస్తుంది'

1621చూసినవారు
రాజోలులో వైసీపీ అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గడిచిన 18 నెలల్లో అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తోందని, జగన్ హయాంలో వచ్చిన కంపెనీలను తామే తీసుకొచ్చినట్లు అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇటుక కూడా నిర్మించడానికి ఇవ్వలేదని, జగన్ నిర్మించిన ఇళ్లను తామే నిర్మించామని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్