రాజోలు: పవన్ మాటలను కాంగ్రెస్ నేతలు వక్రీకరిస్తున్నారు

15చూసినవారు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. బుధవారం రాజోలు పర్యటనలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాల వల్లే కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల సమస్యలు దేశాన్ని పట్టిపీడించాయని విమర్శించారు. తెలంగాణ అంటే ప్రత్యేక దేశం అన్నట్లుగా అక్కడి నేతలు మాట్లాడుతున్నారని, భారతదేశంలో అన్ని ప్రాంతాలు ఒకటేనన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వారు సరిగా అర్థం చేసుకోలేదని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్