రాజోలు మండలం పొదలాడకు చెందిన ధనలక్ష్మి కిరాణా మర్చంట్స్ దుకాణానికి గత నెలకు చెందిన విద్యుత్ బిల్లు రూ. 1,01,603 వచ్చిందని యజమాని కోటిపల్లి ధనబాబు బుధవారం చెప్పారు. గత ఆరు నెలలుగా సగటున రూ. 2,483గా మాత్రమే ఉందన్నారు. బాధితుడు విద్యుత్తుశాఖ అధికారులను సంప్రదించగా దుకాణానికి కొత్తగా స్మారర్ట్ మీటర్ బిగించడంతో పాత మీటర్ లోని రీడింగ్ కూడా కలిసిపోయి అధిక మొత్తంలో వచ్చిందని, తప్పును సరిచేశామన్నారు.