శివనామస్మరణతో మారుమోగుతున్న రాజోలు దీవి

1881చూసినవారు
కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా రాజోలు దీవిలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే కడలి కపోతేశ్వర స్వామి, శివకోటి శ్రీ ఉమా శివలింగేశ్వర స్వామి, చింతలపల్లి రామలింగేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మహిళా భక్తులు కార్తీకదీపాలు, 365 ఒత్తులు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.