రాజోలు: 'ప్రజా సమస్యలను గాలికొదిలేశారు'

2చూసినవారు
రాజోలులో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలు, ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, నిరుద్యోగులు, రైతులు, మహిళల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతుందని కిషోర్ స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్