రాజోలు వైసీపీ ఇంచార్జి, మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు బుధవారం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనను అమలాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. విషయం తెలుసుకున్న అమలాపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆసుపత్రికి వెళ్లి, వైద్య బృందాన్ని అప్రమత్తం చేసి, సమగ్ర వైద్య సేవలు అందించాలని సూచించారు. గొల్లపల్లి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.