రాజోలులో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న అప్పన నాగ ప్రియ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, ఆమె ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాత్రి పురజనులు, ప్రజా సంఘాలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాయి. స్థానిక గాంధీ బొమ్మల కూడలి నుంచి పోలీస్ స్టేషన్ వరకు జరిగిన ఈ ర్యాలీ అనంతరం, నిరసనకారులు పోలీస్ స్టేషన్లో వినతిపత్రం అందజేశారు.