కడలి పరిధిలో వేగంగా పంట కాలువల పూడికతీత పనులు

0చూసినవారు
కడలి పరిధిలో వేగంగా పంట కాలువల పూడికతీత పనులు
రాజోలు మండలం కడలి పరిధిలో జరుగుతున్న పంటకాలువ పనులను కడలి నీటి సంఘం అధ్యక్షుడు గాలిదేవర వెంకన్నబాబు బుధవారం పరిశీలించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులకు అధిక ప్రాధాన్యం కల్పిస్తోందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్టు చైర్మన్ గుబ్బల శ్రీనివాస్ సహకారంతో నిలిచిపోయిన కాలువల పూడికతీత పనులను ముమ్మరంగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కడలి పరిధిలోని చెన్నడం, గెద్దాడ, వేగివారిపాలెం గ్రామాల్లో గుర్రపుడెక్క, పిచ్చి మొక్కలను తొలగించి కాలువలను పునరుద్ధరిస్తున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్