బట్టేలంకలో 'బడి పిలుస్తోంది' ప్రచార వాహనం ప్రారంభం

11చూసినవారు
సమగ్ర శిక్ష సీఎంఓ బి. వి. వి. సుబ్రహ్మణ్యం బుధవారం బట్టేలంక జెడ్పీహెచ్ఎస్ క్లస్టర్ పరిధిలో 'బడి పిలుస్తోంది' ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం అద్భుతమైన పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల కన్నా మెరుగైన డిజిటల్ వసతులు, నాణ్యమైన విద్య ప్రభుత్వ స్కూల్స్‌లోనే లభిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను అక్కడే చేర్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రత్యేక ప్రచార వాహనాన్ని కూడా ఆయన ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్