రాజోలు మండలం శివకోటిలో శ్రీ ఉమా శివలింగేశ్వర స్వామి మరియు శ్రీ మేథిని రామ సమేత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు శుక్రవారం కన్నుల పండుగగా జరిగాయి. ప్రధాన అర్చకులు సన్నిధిరాజు సర్వేశ్వర శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ ఈ వేడుక రమణీయంగా సాగింది. రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్, టీడీపీ ఇన్‌ఛార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొని స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.