మామిడికుదురు మండలం ఈదరాడలో శ్రీ ఉమాసోమేశ్వర, లక్ష్మీనరసింహ స్వామివార్ల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి కోలాట ప్రదర్శన జరిగింది. ఆధ్యాత్మిక గీతాల నేపథ్యంలో మహిళలు చేసిన లయబద్ధమైన నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనను చూసి పులకించిన భక్తులు మహిళల ప్రతిభను కొనియాడారు. అనంతరం ఆలయ నిర్వాహకులు కళాకారులను ఘనంగా సత్కరించారు.