రాజోలు నియోజకవర్గంలో ఆకస్మిక వాతావరణ మార్పు

9చూసినవారు
రాజోలు నియోజకవర్గంలో బుధవారం వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో మేఘావృతమై వర్ష సూచనలు కనిపిస్తుండటంతో రైతులు అప్రమత్తమయ్యారు. కోతకు సిద్ధంగా ఉన్న దాళ్వా వరి పంటను కాపాడుకునేందుకు యంత్రాల సాయంతో కోతలను వేగవంతం చేశారు. పండిన ధాన్యం తడవకుండా ఒబ్బిడి చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు. అకాల వర్షం పడితే పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్