మామిడికుదురు మండలం మగటపల్లిలో యూనిట్ ఇంచార్జ్ కుంచే శ్రీనివాసరావు అధ్యక్షతన ఓటర్ల జాబితాల నిర్వహణ (S. I. R) పై సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ, బూత్ కన్వీనర్లు ప్రతి నెలా సమావేశమై ప్రభుత్వ అభివృద్ధి పనులు, ఓటర్ల జాబితాల మార్పులపై చర్చించాలని సూచించారు. గ్రామాల్లోని కార్యకర్తలు, ప్రజల సమస్యలను క్రమ పద్ధతిలో మండల, నియోజకవర్గ స్థాయికి తీసుకెళ్లి పరిష్కరించేలా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కుంపట్ల బాబ్జితో పాటు బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు.