అంతర్వేది శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

7చూసినవారు
మార్చి 7న అంతర్వేదిలో జరిగే ‘ప్రశిక్షణ మహా అభియాన్’ను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మాలే శ్రీనివాస నగేష్ పిలుపునిచ్చారు. సఖినేటిపల్లి లంకలో జరిగిన బూత్ కమిటీ సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అలాగే వితంతు, డయాలసిస్ రోగులకు పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్