జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు, మంగళవారం రాజోలు రోటరీ క్లబ్‌లో పోలీసుల కోసం యోగా, ధ్యాన సాధనా కార్యక్రమం జరిగింది. హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ శిక్షకులు గుర్రం స్వామి నాయుడు, పోలీసు సిబ్బందికి ప్రాణాయామం, ఒత్తిడి నివారణపై శిక్షణ ఇచ్చారు. విధుల్లో నిత్యం ఒత్తిడిని ఎదుర్కొనే పోలీసులకు మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం కోసం యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని రాజోలు, పి. గన్నవరం సీఐలు సురేష్ బాబు, భీమరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.