
కాబోయే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆస్తుల వివరాలు వెల్లడి!
భారత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సూర్యకాంత్, ఆయన సతీమణి పేర్లపై రూ.8 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు, విలువైన స్థిరాస్తులు, 1.1 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు సుప్రీంకోర్టు వెబ్సైట్లో సమాచారం పొందుపర్చారు. ఆయనకు సొంత వాహనం లేనప్పటికీ, భార్య పేరు మీద వ్యాగనార్ కారు ఉంది. కాగా, కాబోయే ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.




