గోగన్నమఠంలో ఘనంగా వైఎస్సార్‌సీపీ బిఎల్‌ఏల శిక్షణ సమావేశం

1చూసినవారు
రాజోలు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం మామిడికుదురు మండలం గోగన్నమఠంలో నియోజకవర్గ స్థాయి బిఎల్‌ఏల ప్రత్యేక శిక్షణ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయడమే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు. బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆమె ఆదేశించారు.

సంబంధిత పోస్ట్