
జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి రావాలని ప్రత్యేక పూజలు
కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో వినాయకుని ఆలయంలో గ్రామ మహిళలు పాప జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుడు కరుణించి పాపను తొందరగా తల్లి ఒడికి చేర్చాలని కోరారు. కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి ఇంటి నుంచి మహిళలు భారీగా తరలివచ్చి పూజలు నిర్వహించడం విశేషం. గ్రామమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా జ్ఞానేశ్వరి కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.





































