Jan 12, 2026, 16:01 IST/వనపర్తి
వనపర్తి
స్వామి వివేకానంద జయంతి: కౌన్సిలర్ బ్రహ్మచారికి ఘన సన్మానం
Jan 12, 2026, 16:01 IST
వనపర్తిలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా స్థానిక వార్డు కౌన్సిలర్ బ్రహ్మచారిని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వివేకానంద జయంతి కార్యక్రమాల నిర్వహణకు ఆయన అందించిన ప్రోత్సాహం, విశేష సహకారానికి గుర్తింపుగా ఈ సన్మానం జరిగింది. కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోచా రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.