తునిలో కార్డన్ సెర్చ్ లో 23 బైక్ లు స్వాధీనం

2085చూసినవారు
తునిలో కార్డన్ సెర్చ్ లో 23 బైక్ లు స్వాధీనం
కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు, తునిలో ఆదివారం ఉదయం 4 నుంచి 7 గంటల వరకు సీఐ గీతా రామకృష్ణ ఆధ్వర్యంలో వీరవరపు పేట ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ప్రతి ఇల్లు, వీధిని క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు, 5గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్