అన్నవరం దేవస్థానంలో టికెట్ కౌంటర్ల వద్ద

11చూసినవారు
అన్నవరం దేవస్థానంలో టికెట్ కౌంటర్ల వద్ద
కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో గురువారం తెల్లవారుజామున టికెట్ కౌంటర్ల వద్ద భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టికెట్ల జారీలో ప్రణాళిక లోపం, కియోస్క్లు పనిచేయకపోవడం, భద్రతాపరమైన సమస్యలు, అన్ని కౌంటర్లు తెరవకపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ఒకే కౌంటర్ వద్ద అధిక సంఖ్యలో గుమిగూడటంతో గ్రిల్లను నెట్టడంతో అద్దాలు పగిలిపోయాయి. అరగంటకు పైగా ఈ గందరగోళం కొనసాగింది. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారు.