కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ సమీపంలోని శ్రీ గోదాదేవి, మహాలక్ష్మి సమేత ఏడువారాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా అఖండ భజన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తుని పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, అన్నదానం స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.