తుని ఏరియా హాస్పిటల్ వద్ద మృత్యు గొయ్యి

1చూసినవారు
తుని ఏరియా హాస్పిటల్ వద్ద మృత్యు గొయ్యి
తుని ఏరియా హాస్పిటల్ సమీపంలోని ప్రధాన రహదారిపై కేబుల్ వైర్ల కోసం తీసిన గొయ్యిని సరిగా పూడ్చకపోవడంతో వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు ఈ గొయ్యిలో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి గొయ్యిని పూర్తిగా పూడ్చివేయాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్