తుని నియోజకవర్గంలోని 31 మంది పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 17 లక్షల విలువైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ విప్ యనమల దివ్య శనివారం తేటగుంట
టీడీపీ కార్యాలయంలో అందజేశారు. ఆరోగ్య సమస్యలు, అత్యవసర వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ నాయకులు యనమల రాజేష్, చింతమనీడి అబ్బాయి పాల్గొన్నారు.