తుని మండలం తేటగుంట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య ఉత్తమ కార్యకర్తలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఎన్నికల ముందు సైనికుల్లా పనిచేసి పార్టీ విజయానికి కారకులైన కార్యకర్తల సేవలను ఆమె కొనియాడారు. ఇదే స్ఫూర్తితో పార్టీ విజయాలను, కూటమి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మన్ననలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత యనమల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.