నకిలీ మద్యం విక్రయాలను అరికట్టాలని, బెల్ట్ షాపులను మూసివేయాలని, నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నాయకులు సోమవారం తుని పట్టణంలో నిరసన చేపట్టారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, సీనియర్ నాయకులు యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ప్రదర్శన చేశారు. అనంతరం ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు.