గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలి: యనమల దివ్య

2చూసినవారు
తుని నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే యనమల దివ్య అసెంబ్లీలో కోరారు. బుధవారం సభలో ఆమె మాట్లాడుతూ, మూడు మండలాల్లోని గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రాథమిక సదుపాయాల కల్పనతోనే పల్లెల అభివృద్ధి సాధ్యమని ఆమె స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :