తుని ప్రజలకు కీలక సమాచారం.. రేపు అర్జీల స్వీకరణ

5చూసినవారు
తుని ప్రజలకు కీలక సమాచారం.. రేపు అర్జీల స్వీకరణ
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘వన్ మంత్–వన్ విలేజ్–ఫోర్ విజిట్స్’ కార్యక్రమంలో భాగంగా, మే 29న తుని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో భూమి, పింఛన్లు, రేషన్, సంక్షేమ పథకాల వంటి సమస్యలపై ప్రజలు నేరుగా వినతులు అందజేయవచ్చు. అధికారులు ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపడతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్