కోటనందూరు: సీనియర్ జర్నలిస్ట్ మృతిపై పలువురు సంతాపం

12చూసినవారు
కోటనందూరు: సీనియర్ జర్నలిస్ట్ మృతిపై పలువురు సంతాపం
కోటనందూరు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఎల్వీఎస్ త్రిమూర్తులు (శ్రీనివాస్) మంగళవారం మృతిచెందారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాకినాడలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. పెన్ పవర్, అక్షర విజేత తదితర పత్రికల్లో పనిచేసిన ఆయన మృతి పట్ల పలువురు పాత్రికేయులు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్