తుని పట్టణంలోని జీఎన్డీటీ రోడ్డులో ఉన్న 'మిస్సమ్మ బంగ్లా' వందేళ్లకు పైగా చరిత్రను కలిగి ఉంది. కెనడాకు చెందిన మహిళలు ఇక్కడ స్థానిక మహిళలకు బైబిల్, కుట్టు, టైప్ రైటింగ్ వంటి వృత్తి విద్యల్లో శిక్షణ ఇచ్చేవారు. 'మిస్'లను స్థానికులు 'మిస్సమ్మ'లుగా పిలిచేవారు. బర్మా టేకు, గానుగ సిమెంటుతో నిర్మించిన ఈ బంగ్లా, కెనడాలోని భవనాలను పోలి ఉంటుంది. ఇందులో విశాలమైన హాలు, అధికారులకు, సహాయకులకు విశ్రాంతి గదులు, రక్షణ సిబ్బందికి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి.