తుని పట్టణ శివారులోని ఎస్. అన్నవరం పంచాయితీ శివారు రామకృష్ణ నగర్‌లో అభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయి. సోమవారం, రామకృష్ణ కాలనీలో రూ. 7 లక్షల వ్యయంతో నిర్మించిన కొత్త సిమెంట్ రోడ్డును యనమల దివ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అన్ని గ్రామాల్లో అవసరమైన నిధులను ప్రాధాన్యత ప్రకారం కేటాయిస్తామని దివ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.