కోటనందూరు మండలం అల్లిపూడిలో ఎమ్మెల్యే యనమల దివ్య శుక్రవారం ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. సచివాలయంలో కంటి శస్త్రచికిత్స పొందిన లబ్ధిదారులకు కళ్లద్దాలు పంపిణీ చేశారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దివ్య తెలిపారు.