చామవరంలో సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

6చూసినవారు
జూన్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుని మండలం చామవరం గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం, ప్రజాదర్బార్ వేదికలను అధికారులతో కలిసి సందర్శించి అవసరమైన సూచనలు చేశారు. హెలిప్యాడ్ ప్రాంతాన్ని తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు కల్పించే సౌకర్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం పర్యటన విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్