కెమెరాలకు ఆంక్షలు.. మీడియా అసంతృప్తి

2చూసినవారు
కెమెరాలకు ఆంక్షలు.. మీడియా అసంతృప్తి
కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో సోమవారం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మీడియా ప్రతినిధులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కెమెరాలు తీసుకురావద్దని, సెల్‌ఫోన్లలో వీడియోలు చిత్రీకరించవద్దని సమాచార శాఖ సూచించడంతో జర్నలిస్టులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్తా సేకరణలో చిత్రీకరణ కీలక భాగమని, ఈ ఆంక్షలు మీడియా విధులకు ఆటంకం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. "రండి. చూడండి. వెళ్లండి" అన్న తరహా సూచనలపై కూడా పలువురు జర్నలిస్టులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్